డిసెంబర్ 4న వృషకర్మ.. 50 రోజుల కౌంట్‌డౌన్‌తో నాగచైతన్య కొత్త పోస్టర్!
అక్కినేని నాగచైతన్య(Akkineni naga chaitanya) కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. కార్తీక్ దండు(Karthik dandu) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌కు వృషకర్మ(Vrusha karma) అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాంశం, ఉత్కంఠభరితమైన సీన్స్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మిస్తున్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం విశేషం.
తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ సినిమా రిలీజ్ డేట్ ను మరోసారి అనౌన్స్ చేసింది. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా రిలీజ్ కు ఇంకా 50 రోజులే మిగిలి ఉన్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఇందులో నాగచైతన్య పర్వత శిఖరాన్ని చేరుకునేందుకు తాడును గురిపెడుతూ కనిపిస్తున్నారు. వెనుకవైపు పేలుళ్లు చోటుచేసుకుంటున్న దృశ్యాలు చైతూ పాత్రలోని సాహసం, ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనే స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మానవాళికి తెలియని రహస్యాల అన్వేషణ నేపథ్యంలో సినిమా సాగనుందనే ఆసక్తిని ఈ పోస్టర్ పెంచుతోంది.
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi chaudhary) హీరోయిన్ గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ(Sparsh srivastava) విలన్ ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. వైవిధ్యమైన కథలను తెరపై ఆవిష్కరించడంలో ప్రత్యేకత చాటుకున్న కార్తీక్ దండు ఈసారి ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించారన్నది ఆసక్తికరంగా మారింది. భారీ నిర్మాణ విలువలు, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా సాగుతున్నాయి. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో రానున్న రోజుల్లో ప్రచార కార్యక్రమాలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.








