ఓవర్సీస్ భారీ కలెక్షన్లపై ‘వారణాసి’ దృష్టి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో, సరికొత్త అడ్వెంచర్ జోనర్లో రూపొందుతున్న సినిమాకు సంబంధించి మేకర్స్ వినూత్నమైన ప్రచార వ్యూహానికి తెరతీశారు. సాధారణంగా సినిమా విడుదలకు కొన్ని వారాల ముందు ప్రచారం ప్రారంభించడం టాలీవుడ్లో ఆనవాయితీగా కనిపిస్తుంది. కానీ వారణాసి విషయంలో మాత్రం ఏకంగా నాలుగు నెలల ముందే ప్రచార పర్వాన్ని ప్రారంభించాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం.
కాగా మరోవైపు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కేల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఇందులో మొత్తం ఆరు పాటలు ఉంటాయని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గతంలోనే కన్ఫర్మ్ చేశారు. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అన్ని పాటలు ఉండటం సినీ లవర్స్ ను ఆలోచనలో పడేసింది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది ఏకకాలంలో 120 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్లాన్ చేస్తున్న చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ తీసుకురావడమే ముందస్తు ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. హాలీవుడ్ స్థాయి సినిమాలకు దీటుగా ప్రమోషన్స్ నిర్వహించాలని భావిస్తున్న రాజమౌళి అండ్ టీమ్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. సాధారణంగా హాలీవుడ్ తరహా భారీ అడ్వెంచర్ సినిమాల్లో పాటలకు అస్సలు చోటు ఉండదు. కానీ రాజమౌళి మాత్రం తన గ్లోబల్ ప్రాజెక్ట్‌లోనూ ఇండియన్ సినిమా అసలైన మ్యూజికల్ ఫ్లేవర్‌ను వదిలిపెట్టే ఆలోచన చేయడం లేదు. ఆయన సినిమాల్లో పాటలంటే కేవలం హీరో హీరోయిన్ల రొటీన్ డ్యూయెట్స్ మాత్రమే కావు. కథలోని మూడ్‌ను, ప్రధాన పాత్రల లోతైన ఎమోషన్లను ముందుకు నడిపించే ఒక బలమైన ఆయుధంగానే సంగీతాన్ని ఎక్కువగా వాడుతుంటారు.
వారణాసి గ్లోబల్ ప్రచార వ్యూహంలో భాగంగా కొన్ని ప్రత్యేక దేశాలను ఎంపిక చేసి అక్కడ స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారట. ఆయా దేశాల్లోని ప్రముఖ మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు , ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ ట్రెండ్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ క్యాంపెయిన్ సాగనుంది. మహేష్ ఇమేజ్ను గ్లోబల్ స్థాయిలో మరింత ఇనుమడింపజేసేలా సినిమాలోని విజువల్స్ మేకింగ్ వీడియోలను దశలవారీగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇప్పటికే సినిమా కోసం మహేష్ జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో కఠినమైన ట్రెయినింగ్ తీసుకోవడం, చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగడం వంటి అంశాలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. రాజమౌళి టేకింగ్, విజయేంద్ర ప్రసాద్ కథా బలంతో వస్తున్న చిత్రం ఇండియన్ సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగు నెలల ముందే ప్రారంభమయ్యే ఈ ప్రచార జోరుతో సినిమాపై హైప్ అంతకంతకూ పెరుగుతుంది. ఇదే నిజమైతే ఇంత భారీ స్థాయిలో ఒక సినిమాకు గ్లోబల్ మార్కెటింగ్ చేయడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. కేవలం దేశీయ మార్కెట్ మాత్రమే కాకుండా ఓవర్సీస్ లోనూ భారీ కలెక్షన్లను రాబట్ట డమే లక్ష్యంగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చాటి చెప్పనున్నారు రాజమౌళి. వారణాసి సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోందని ఇప్పటికే మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మూడు నాలుగు గెటప్స్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. రాముడి మహేష్ కనిపించనున్నారని ఇప్పటికే రాజమౌళి చెప్పేశారు. అయితే గతంలో వారణాసి సినిమాలో హనుమంతుడిగా మాధవన్ నటిస్తున్నారని ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు మరో హీరో పెను బయటకు వచ్చింది. ఆయన ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ వారణాసి సినిమాలో హనుమంతుడిగా నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.








