UBS: ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. అవే హరి హర వీరమల్లు(Hari hara veera mallu), ఓజి(OG). ఈ రెండు సినిమాల్లో హరి హర వీరమల్లు(HHVM) ఫ్లాపవగా, ఓజి సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక పవన్ షూటింగ్ చేసిన సినిమాల్లో రిలీజ్ కావాల్సిన సినిమా ఒకటే ఉంది.
అదే ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh). హరీష్ శంకర్(harish sankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల(Sree leela), రాశీ ఖన్నా(Raashi khanna) హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ గతేడాదిలోనే రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మార్చి 26వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్(UBS) రిలీజ్ కానున్నట్టు చిత్ర బృందం అనౌన్స్ చేసింది.
ముందు ఈ సినిమా ఏప్రిల్ లో వస్తుందనుకున్నారంతా. కానీ ఇప్పుడు సడెన్ గా దాన్ని మార్చికి ప్రీ పోన్ చేసి ఓ సరికొత్త పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఈ పోస్టర్ లో మధ్యలో పవన్ నిల్చుని ఉండగా, చుట్టూ జనాలున్నారు. దేవీ శ్రీ ప్రసాద్(Devi sri prasad) సంగీతం అందిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. గతంలో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్(Gabbar singh) బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడీ సినిమా కూడా అలాంటి ఫలితాన్నే సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కాగా ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తోంది.






