Suriya: ఆ డైరెక్టర్ తో సూర్య మరోసారి?
తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) కెరీర్లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిన జై భీమ్(Jai bhim) గురించి సినీ ప్రియులు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. కరోనా టైమ్ లో ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై విశేష ఆదరణ పొందింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామా, సామాజిక న్యాయం మీద బలమైన సందేశాన్ని అందించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు టిజె జ్ఞానవేల్(TJ Gnanavel) ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఇప్పుడు ఈ సూపర్‌హిట్ కాంబినేషన్ మళ్లీ కలిసి పని చేయబోతుందనే వార్త ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టిజె జ్ఞానవేల్ మరోసారి సూర్యను డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కూడా రియలిస్టిక్ కథతోనే రూపొందనుందని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమైన దర్శకుడు, త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సూర్య స్వంత నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం.
ఇక జై భీమ్ తరువాత టిజె జ్ఞానవేల్, సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) తో వేట్టియాన్(Vettiyan) సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు సూర్య తన తదుపరి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కరుప్పు(karuppu), విశ్వనాథ్ అండ్ సన్స్(Viswanath and sons) సినిమాల షూటింగ్ పూర్తి చేసిన ఆయన, ఈ రెండు సినిమాలు మూడు నెలల గ్యాప్‌లో విడుదల కానున్నాయి. అలాగే జిత్తు మాధవన్(Jithu Madhavan) దర్శకత్వంలో తన 47వ సినిమాను కూడా సూర్య ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు.








