రెమ్యూనరేషన్ రూమర్లకు క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి..
సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కు ఉన్న క్రేజ్‌ను అంచనా వేయడానికి రెమ్యూనరేషన్ ఒక్కటే కొలమానం కాదు. ఆడియన్స్ లో ఆదరణ, కథల ఎంపికలో వైవిధ్యం, పాత్రల ద్వారా తెచ్చుకునే గుర్తింపు కూడా ఆమె కెరీర్‌ను ప్రభావితం చేస్తాయి. తాజాగా కన్నడ భామ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) విషయంలో ఇదే డిస్కషన్ కు దారితీసింది. ఆమె ఒక్కో సినిమాకు రూ.7- 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందంటూ ప్రచారం జరగడంతో, తన రెమ్యూనరేషన్పై వస్తున్న వార్తలకు ఈ భామ స్పందించింది. తన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ చేస్తూ, తాను ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాల్లోనే నటించానని పేర్కొంది.
డబ్బు సంపాదించడమే తన మెయిన్ టార్గెట్ అయితే, ఇప్పటికే ఎన్నో సినిమాలు ఒప్పుకుని ఉండేదాన్నని శ్రీనిధి చెప్పిన మాటలు ఆమె కెరీర్ విధానాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చాయి. కేజీఎఫ్(KGF) ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించినప్పటికీ, వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోవడం కంటే తనకు నచ్చిన కథలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది శ్రీనిధి. అయితే ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కు మార్కెట్ విలువను డిసైడ్ చేసేది ఆమె తీసుకునే రెమ్యూనరేషనా? లేక ప్రేక్షకుల ఆదరణ, సినిమాల ఫలితాలు, పాత్రల ఎంపిక కూడా అంతే కీలకమా? అన్న ప్రశ్నలు ఈ సందర్భంగా ఆసక్తికరంగా మారాయి.
ప్రస్తుతం వెంకటేష్(Venkatesh) సరసన త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam)లో శ్రీనిధి నటించింది. ఈ సినిమా ఆమె తెలుగు కెరీర్‌కు మరో ముఖ్యమైన అవకాశంగా నిలవనుంది. భారీ రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ప్రచారాల కంటే, తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెప్పించడం ద్వారా గుర్తింపు పెంచుకోవడమే ఆమెకు కీలకం. మరి ఈ సినిమా శ్రీనిధి కెరీర్‌కు ఎలాంటి బలాన్ని ఇస్తుందో చూడాలి.








