రిలీజ్ కు ముందే రికార్డుల వేట.. కాకాపై తమన్ ధీమా!
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) సినిమా అంటేనే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. అందులోనూ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న కాకా(kaaka)పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్(thaman) చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు సినిమా చుట్టూ డిస్కషన్ ను మరింత పెంచింది. చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఆల్‌టైమ్ రికార్డ్స్ ను సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేయడం ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా టమ్ ఉండగానే తమన్ సినిమా గురించి ఇంత నమ్మకంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
తమన్ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరగడమే కాకుండా, సినిమా స్థాయిపై కొత్త అంచనాలు మొదలయ్యాయి. ఆయన పోస్ట్‌కు చిత్రబృందం కూడా తగలపెట్టేద్దాం అంటూ రియాక్ట్ అవడంతో సోషల్ మీడియాలో కాకాపై హైప్ మరింత పెరిగింది. సాధారణంగా రిలీజ్ కు దగ్గరపడే కొద్దీ ప్రమోషన్స్ తో సినిమాపై బజ్ పెంచుతుంటారు. కానీ, ముందుగానే కాకా టీమ్ ఇంతటి ధీమాను ప్రదర్శించడం వెనుక సినిమాపై ఉన్న నమ్మకమే కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఉత్సాహం ప్రేక్షకుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాలి.
వాల్తేరు వీరయ్య(valtair veerayya) తర్వాత చిరంజీవి, బాబీ(bobby) కలిసి చేస్తున్న సినిమా కావడంతో కాకాపై మొదటి నుంచే అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు సంక్రాంతి బరిలో ఇతర సినిమాల నుంచి పోటీ కూడా ఉండనుంది. ఇలాంటి పరిస్థితుల్లో రికార్డులపై తమన్ వ్యక్తం చేస్తున్న నమ్మకాన్ని సినిమా ఎంతవరకు నిజం చేస్తుందనేది కీలకం. ఆకట్టుకునే కథ, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ను మెప్పిస్తేనే భారీ కలెక్షన్లకు అవకాశముంటుంది. మరి తమన్ ధీమా నిజమై కాకా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందా అన్నది వేచి చూడాలి.








