మెగాస్టార్ బర్త్ డే కు స్పెషల్ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న #Mega158 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. KVN ప్రొడక్షన్స్(KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ(Venkat K Narayana) నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 40 రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కథలో కీలక భాగాన్ని ఈ షెడ్యూల్లోనే పూర్తి చేసిన మేకర్స్.. ప్రస్తుతం ఫస్ట్ హాఫ్‌ను ముగింపు దశకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
షూటింగ్ నుంచి వస్తున్న అవుట్‌పుట్‌పై చిత్రబృందం కూడా సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కథలోని ఎమోషన్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మేళవిస్తూ బాబీ తెరకెక్కిస్తున్న విధానం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారనుందని టాక్. ముఖ్యంగా చిరంజీవి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ ఎపిసోడ్స్‌ను గ్రాండ్‌గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఆడియన్స్ కు గూస్బంప్స్ తెప్పించేలా ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఫైట్‌ను భారీ సెటప్‌తో షూట్ చేసినట్టు సమాచారం.
ఇక చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న #Mega158 నుంచి స్పెషల్ అప్డేట్ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ లో ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. మరోవైపు ఈ సినిమాను సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. షూటింగ్ ఇదే వేగంతో కొనసాగితే నిర్మాణ పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.








