ఇరుముడిపై పెరిగిన అంచనాలు.. జీ.వీ. ట్వీట్‌తో మరింత హైప్
మాస్ హీరో రవితేజ(Raviteja)ను ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్న సినిమా ఇరుముడి(Irumudi). థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందే మంచి ఆసక్తి పెరుగుతోంది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్(G.V Prakash) కుమార్ ఇచ్చిన హైప్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ఇరుముడి క్లాసిక్‌గా నిలిచే అవకాశం ఉందంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తయిందని ఆయన వెల్లడించడం విశేషం.
సాధారణంగా ఒక సినిమాకు మ్యూజిక్ డైరెక్టరే తొలి ఆడియన్ గా ఫైనల్ అవుట్‌పుట్‌ను పరిశీలిస్తారు. అందుకే జీ.వీ. ప్రకాష్ వంటి ఎక్స్పీరియెన్డ్స్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా గురించి ఇంత నమ్మకంగా మాట్లాడటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్స్ కూడా సానుకూలంగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో ఇరుముడిలో కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) తనదైన ఎమోషనల్ స్క్రీన్‌ప్లే తో ఈ థ్రిల్లర్‌ను రూపొందించినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మాణ విలువలు సినిమాకు మరో బలంగా నిలవనున్నాయి. ఇక రవితేజ ఈ సినిమాలో ఇంతకుముందు కనిపించని షేడ్స్‌లో నటించడంతో పాటు, తన కెరీర్లో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ వరుసగా వస్తున్న పాజిటివ్ బజ్‌తో ఇరుముడిపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.








