ఒకేసారి మూడు యూనిట్లతో ఫౌజీ షూటింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ(Fauzi) సినిమాపై ఇప్పుడు షూటింగ్ వేగం పెరిగింది. పెండింగ్‌లో ఉన్న సీన్స్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్రబృందం రెస్ట్ లేకుండా పనిచేస్తోంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలకమైన షూటింగ్ జరుగుతుండగా, ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్‌కు భారీగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లోపే తనకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి తర్వాతి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడంలో భాగంగా ఒకేసారి మూడు యూనిట్లు పనిచేస్తున్నాయి. ప్రభాస్‌కు సంబంధించిన ఎపిసోడ్స్‌ను హను రాఘవపూడి స్వయంగా తెరకెక్కిస్తుండగా, మిగిలిన భాగాలను ఇతర టీమ్స్‌కు విభజించి షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టైమ్ ను ఆదా చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా తగినంత టౌమ్ కేటాయించాలనే ఉద్దేశంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా సినిమాను రెడీ చేయడమే ప్రస్తుత మెయిన్ టార్గెట్ గా కనిపిస్తోంది.
మరోవైపు ఫౌజీ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడంతో షూటింగ్, రిలీజ్ విషయంలో డెడ్‌లైన్ మరింత కీలకంగా మారింది. డిసెంబర్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ చేయడంతో పెండింగ్ షూట్‌ను వీలైనంత త్వరగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హను రాఘవపూడి టీమ్‌పై ఇప్పుడు టైమ్ ప్రెజర్ పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి(Imanvi) హీరోయిన్గా నటిస్తున్నారు.








