తెలుగు డైరెక్టర్లకు బన్నీ చిక్కడం లేదా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అట్లీ(Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా(Raaka) షూటింగ్లో పాల్గొంటున్న బన్నీ(bunny).. ఈ సినిమా షూటింగ్ ను ఈ ఇయర్ ఎండింగ్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, బన్నీ కెరీర్లో ఇది మరో కీలక సినిమాగా నిలవనుంది.
రాకా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయింది. తక్కువ టైమ్ లో, గ్యాప్ లు లేకుండా ఫాస్ట్ షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తి చేసేలా లోకేష్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా 2027లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో వచ్చే ఏడాది బన్నీ వరుసగా రెండు కీలక ప్రాజెక్టులతో బిజీ కానున్నారు.
లోకేష్ ప్రాజెక్ట్ తర్వాత మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(Basil Joseph)తో అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాకపోయినా ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టు సమాచారం. బన్నీ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్(geetha Arts) ఈ సినిమాను నిర్మించనుంది. వరుసగా నాన్ తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేస్తుండటంతో బన్నీ ప్రస్తుత కమిట్మెంట్లు 2028 చివరి వరకు కొనసాగనున్నాయి. దీంతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లకు ప్రస్తుతం బన్నీ డేట్స్ దొరకడం కష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.








