ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ వెయిటింగ్..
విక్టరీ వెంకటేష్(venkatesh)తో ఆదర్శ కుటుంబం(Aadarsa Kutumbam) సినిమాను తెరకెక్కిస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas).. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. అక్టోబర్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ పూర్తిగా ఎన్టీఆర్(NTR)తో చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. డ్రాగన్(Dragon) షూటింగ్లో ఎన్టీఆర్‌కు గాయమైన నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, 2027 జూన్‌లోనే రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో టీమ్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
డ్రాగన్ రిలీజ్ వరకు ఎన్టీఆర్ అదే లుక్‌ను కొనసాగిస్తూ ప్రమోషన్స్‌లోనూ పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో జూన్ 2027 వరకు ఆయన త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత కొత్త లుక్‌లోకి మారేందుకు కూడా ఎన్టీఆర్‌కు కొన్ని వారాల టైమ్ అవసరమవుతుంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ మరో సినిమాను త్వరగా పూర్తి చేస్తారా? అనే డిస్కషన్ మొదలైంది. అయితే పదినెలల్లో ఓ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే డైరెక్టర్ గా త్రివిక్రమ్‌కు ట్రాక్ రికార్డ్ లేదు.
అందుకే ఎన్టీఆర్ రాక కోసం వేచి చూస్తూనే, ఈలోపు మైథలాజికల్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను మరింత పక్కాగా పూర్తి చేయడమే త్రివిక్రమ్ ప్లాన్‌గా కనిపిస్తోంది. కథ, క్యారెక్టర్ డిజైన్, భారీ సెట్స్, విజువల్ ట్రీట్మెంట్ వంటి అంశాలపై ఆయన ఎక్కువ టైమ్ కేటాయించే అవకాశముంది. గాడ్ ఆఫ్ వార్(God Of War) అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika Haasinee Creations) బ్యానర్ నిర్మించనుంది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ భారీ సినిమా కోసం ఈ వెయిటింగ్ పీరియడ్ కీలకంగా మారనుంది.








