Shambhala: ఓటీటీలో శంబాల రికార్డు
సాయి కుమార్(sai kumar) కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయికుమార్(Aadi sai kumar) మొదటి సినిమా ప్రేమ కావాలి(prema kavali) మూవీతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది కెరీర్ గత కొన్ని సినిమాలుగా ఏమంత బాలేదు. ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తున్నాడే తప్పించి దానికి తగ్గ ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు.
కానీ రీసెంట్ గా వచ్చిన శంబాల(Shambhala) సినిమా మాత్రం ఆదికి మంచి సక్సెస్ ను ఇచ్చింది. మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆదికి ఎంతో పేరును తెచ్చిపెట్టడంతో పాటూ ఈ సినిమాలో అతని యాక్టింగ్ కు ప్రశంసలు కూడా అందుకున్నాడు. శంబాల సినిమాను ఎంచుకుని ఈ సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఆది వంద శాతం సక్సెస్ అయ్యాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గతేడాది డిసెంబర్ ఆఖరిలో రిలీజైన శంబాల మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకుని రీసెంట్ గా జనవరి 22న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(aha)లో రిలీజైంది. ఈ సినిమాకు ఓటీటీలో కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే శంబాల ఓటీటీలో రిలీజైన 10 రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ ను దాటి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో శంబాల మూవీకి బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ దక్కిందని చెప్పొచ్చు.






