ది ప్యారడైజ్ కు రికార్డు ఓపెనింగ్ సంకేతాలు
నాని(nani) కెరీర్లో అత్యంత భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో ది ప్యారడైజ్(the paradise) ఒకటిగా నిలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల(srikanth Odela) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉండగా, అనిరుధ్ రవిచందర్(anirudh Ravichander) అందించిన ఆయా షేర్(aaya sher), యష నాగుల(yasha nagula) సాంగ్స్ ఆ క్రేజ్‌ను మరింత పెంచాయి. ఈ ప్రభావం ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. నైజాం, ఓవర్సీస్లో మొదలైన టికెట్ సేల్స్ వేగంగా సాగుతూ ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా గ్రాస్‌ను ఇప్పటికే అందుకున్నాయి. ఏపీ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉండటంతో రిలీజ్ కు ముందే ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా నైజాం ఏరియాలో లక్షకు పైగా టికెట్లు అమ్ముడవడం సినిమాపై ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి యాప్స్ లో గంటకు దాదాపు 29 వేల టికెట్ల చొప్పున అమ్ముడవుతున్నట్టు సమాచారం. దీంతో ఆడియన్స్ డిమాండ్‌కు తగ్గట్టుగా మరిన్ని థియేటర్లను అందుబాటులోకి తీసుకురావడంపై మేకర్స్ దృష్టి పెట్టారు. రిలీజ్ కు ఇంకా మూడు రోజుల టైమ్ ఉండటంతో రాబోయే రోజుల్లో బుకింగ్స్ మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే సినిమా వర్క్స్ టైమ్ కు పూర్తవుతాయా అనే సందేహాలకు తెరదించుతూ ఓవర్సీస్ ప్రింట్లను కూడా మేకర్స్ ఇప్పటికే పంపించారు. ఇతర భాషల వెర్షన్ల వర్క్స్ కొనసాగుతున్నాయి. రిలీజ్ ముందు రోజు కాకుండా మూడు రోజుల ముందే ఈ ఏర్పాట్లు పూర్తి చేయడం టీమ్ ప్లానింగ్‌ను చూపిస్తోంది. భారీ ఓపెనింగ్‌పై నమ్మకంతో ఉన్న టీమ్ నేడు నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ప్రమోషన్స్‌ను మరింత జోరుగా తీసుకెళ్లనుంది.








