ది ప్యారడైజ్ ప్రమోషన్స్ లో మోహన్ బాబు మిస్సింగ్.. రీజనేంటి?
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న సీనియర్ నటుడు మోహన్‌బాబు(mohan babu) ప్రస్తుతం నాని(nani) ది ప్యారడైజ్(the paradise) లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన మెయిన్ విలన్ గా నటిస్తున్నట్టు ఇప్పటికే స్పష్టమైంది. మోహన్‌బాబు క్యారెక్టర్ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆయన ప్రమోషన్స్‌లో కనిపించకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల శ్రీనివాస మంగాపురం(srinivasa mangapuram)లో కనిపించిన ఆయన పాత్రకు పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో.. ది ప్యారడైజ్ తో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైన మోహన్‌బాబు నుంచి ఒకటి రెండు స్పెషల్ ఇంటర్వ్యూలు వస్తే సినిమాపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉండేది. ముఖ్యంగా ఆయన పోషిస్తున్న పాత్ర, నానితో తన కాంబినేషన్, శ్రీకాంత్ ఓదెలతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వంటి విషయాలపై మోహన్‌బాబు మాట్లాడితే సినిమాకు అదనపు బజ్ వచ్చేది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ.. ముందుగానే రికార్డ్ చేసిన ఇంటర్వ్యూలు, డిజిటల్ ప్రమోషన్స్ ఉంటే మరింత ఇంపాక్ట్ చూపించేవి.
ఇక ది ప్యారడైజ్ లో నానితో పాటు పలువురు నటీనటులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రమోషన్స్‌లో నాని మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నారు. హీరోయిన్ కాయదు లోహర్(kayadhu lohar) కూడా మీడియా ఇంటరాక్షన్స్కు దూరంగానే ఉంది. నాని నిన్న మీడియాతో మాట్లాడగా.. ఈరోజు హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి. సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇప్పటికే ఉన్న హైప్‌ను మరింత పెంచేందుకు చివరి దశ ప్రమోషన్స్‌పై టీమ్ ఫోకస్ పెట్టింది.








