కార్తికేయ కమ్‌బ్యాక్.. డైరెక్టర్‌గా కూడా!
కార్తికేయ గుమ్మకొండ(karthikeya gummakonda) కెరీర్లో మరో ఆసక్తికరమైన మలుపు మొదలైంది. బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేసిన కార్తికేయ.. కమ్‌బ్యాక్(comeback) అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు కథను రాసి, దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే చేపడుతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ డ్రామా ద్వారా కార్తికేయ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
కమ్‌బ్యాక్ ఫస్ట్ గ్లింప్స్‌లోనే కథపై ఆసక్తిని పెంచేలా మిస్టరీ ఎలిమెంట్‌ను చూపించారు. మూడేళ్లుగా బాక్సింగ్‌కు దూరంగా ఉన్న ఓ ఫైటర్ గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం, అతడు ఇక తిరిగి రింగ్‌లోకి వస్తాడా లేదా అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గతంలో ఆర్ఎక్స్100(RX100)తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. హీరోగా, విలన్‌గా విభిన్న పాత్రలు చేసిన తర్వాత ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ వైపు అడుగులు వేయడం గమనార్హం.
ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ కూడా ఆసక్తికరంగానే ఉంది. విజయ్ బుల్గానిన్(vijay bulganin) మ్యూజిక్ అందిస్తుండగా, జగదీష్ చీకటి(jagadessh cheekati) సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేఆర్ కుమార్ మన్నె(KR Kumar manne) ఆర్ట్ డైరెక్టర్‌గా, కళ్యాణ్ సూర్యప్రకాశ్(kalyan surya praskash) ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శిల్పా తంగుటూరి(silpa thanguturi) స్టైలింగ్, సూర్య అక్కెల్ల(surya akkella) క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కార్తికేయతో నటించే ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.








