శింబు టాలీవుడ్ లాంఛ్ కు వేళాయే!
తెలుగు సినిమా మార్కెట్‌ను దాటి తమిళ స్టార్లతో వరుస ప్రాజెక్టులు చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) తన లైనప్‌ను విస్తరిస్తోంది. ఇప్పటికే ధనుష్(Dhanush), సూర్య(suriya), కార్తీ(karthi) వంటి హీరోయిన్లతో సినిమాలు నిర్మిస్తున్న ఈ సంస్థ.. ఇప్పుడు మరో క్రేజీ తమిళ హీరోను టాలీవుడ్లోకి తీసుకురాబోతోంది. సిలంబరసన్ అలియాస్ శింబు(simbu) హీరోగా ఓ ద్విభాషా సినిమాను నిర్మించేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో శింబు తొలిసారి నేరుగా తెలుగు సినిమాలో నటించనున్నారు.
డ్యూడ్(dude) ఫేమ్ కీర్తీశ్వరన్(keerthiswaran) ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి హీరో, డైరెక్టర్ తో పాటు కీలకమైన నటీనటులు, టెక్నీషియన్ల సెలెక్షన్ కూడా పూర్తైనట్లు సమాచారం. ప్రస్తుతం అఫీషియల్ అనౌన్స్మెంట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్ట్ వివరాలను సితార ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించనుందని టాక్. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శింబు అరసన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ తర్వాత కీర్తీశ్వరన్ దర్శకత్వంలోని సినిమానే ఆయన నెక్ట్స్ ప్రాజెక్టుగా ఉండనుంది. మరోవైపు సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్(viswanath and sons) తో సక్సెస్ ను అందుకున్న సితార.. కార్తీ(karthi)తో కళ్యాణ్ శంకర్(kalyan sankar) దర్శకత్వంలో మరో సినిమాను నిర్మిస్తోంది. నెక్ట్స్ ఇయర్ ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శింబును తెలుగులో లాంచ్ చేసే బాధ్యతను కూడా సితార తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.








