బుచ్చిబాబు నెక్ట్స్ మూవీపై క్లారిటీ
ఉప్పెన(Uppena)తో డైరెక్టర్ గా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానా(Buchibabu sana).. ఆ తర్వాత రామ్ చరణ్(ram charan) హీరోగా పెద్ది(peddi) తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజైన తర్వాత బుచ్చిబాబు తర్వాతి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుందనే ఆసక్తి ఇండస్ట్రీలో పెరిగింది. ముఖ్యంగా స్టార్ హీరోల పేర్లు వరుసగా తెరపైకి వస్తుండటంతో ఆయన నెక్ట్స్ మూవీపై డిస్కషన్ మరింత పెరిగింది. ఇటీవల సూపర్‌స్టార్ మహేష్ బాబు(mahesh babu)ను బుచ్చిబాబు కలిశారని, ఓ కథ గురించి డిస్కషన్స్ జరిగాయని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలో వాస్తవం లేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ రూమర్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో బుచ్చిబాబు తర్వాతి సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ డిస్కషన్స్ జరగలేదని సమాచారం. ప్రస్తుతం బుచ్చిబాబు తన తర్వాతి సినిమాకు సంబంధించిన కథపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కథ పూర్తయ్యే వరకు హీరో విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
మరోవైపు బుచ్చిబాబు తర్వాతి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మించనున్నట్లు ఇప్పటికే కమిట్మెంట్ ఉంది. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ స్క్రిప్టింగ్ దశలోనే ఉంది. పెద్ది తర్వాత రామ్ చరణ్ కూడా బుచ్చిబాబుతో మరోసారి సినిమా చేయడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నా, ఈ విషయంపై ఇప్పటివరకు డిస్కషన్స్ మొదలవలేదు. కథ పూర్తయ్యాకే హీరోలను సంప్రదించే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి చిరంజీవి- బుచ్చిబాబు కాంబినేషన్ కేవలం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.








