ఇద్దరు భామలతో రవితేజ కొత్త మూవీ?
రీసెంట్ గా ఇరుముడి(irumudi) తో మంచి సక్సెస్ ను అందుకున్న మాస్ మహారాజా రవితేజ(raviteja) అదే జోష్‌లో వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ఈ క్రమంలో అంటే సుందరానికీ(Ante sundaraniki), సరిపోదా శనివారం(Saripodha sanivaram) వంటి డిఫరెంట్ సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ(Vivek athreya)తో రవితేజ చేస్తున్న సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటోషూట్ సోమవారం జరిగినట్లు సమాచారం. త్వరలోనే సినిమాను అఫీషియల్ గా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హారర్ నేపథ్యంతో సాగే ఈ కథలో కామెడీకి కూడా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రియాంక అరుళ్ మోహన్(priyanka arul mohan) పేరు ప్రచారంలో ఉండగా, తాజాగా మలయాళ నటి అనస్వర రాజన్(Anaswara rajan) పేరు కూడా తెరపైకి వచ్చింది. రీసెంట్ గా వీరిద్దరూ ఫొటోషూట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రవితేజతో ఇద్దరు హీరోయిన్లకూ ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అయితే అనస్వర రాజన్‌ను హీరోయిన్ గా తీసుకున్నారా? లేక కీలకమైన స్పెషల్ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశారా? అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. చాంపియన్, ఇట్లు అర్జునతో పాటు చిరంజీవి కాకాలోనూ ఆమె కీలక పాత్రలో కనిపించనుంది.
ఇక ఈ సినిమాకు తులాభారం(Thulabharam) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. విభిన్న కథాంశాలను ఎంచుకోవడంతో పాటు తన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ను ఎక్కువగా జోడించే వివేక్ ఆత్రేయ, రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ కథను రూపొందిస్తున్నట్లు టాక్. టైటిల్‌తో పాటు హీరోయిన్ల విషయంలోనూ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.








