తెలంగాణ లో సినిమా టిక్కెట్లకు కొత్త రేట్లు
తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుపై కీలక జీవో జారీ చేసింది. టికెట్ హైక్స్ ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు సినీ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది. అలానే నాన్-ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు సంబంధించి కనిష్ఠ, గరిష్ఠ టికెట్ ధరలను నిర్ణయించడంతో పాటు ప్రతి థియేటర్లో రోజుకు 5 షోలకు అనుమతినిచ్చింది. తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ హైక్స్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGఖీణ్పు)కు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.అయితే టికెట్ రేట్స్ పెంపు ద్వారా వచ్చిన మొత్తాన్ని సినీ కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది.
‘అఖండ-2’, ‘ది రాజాసాబ’, ‘మన శంకర వరప్రసాద్‌గారు’, ‘పెద్ది’ వంటి సినిమాలకు తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకోడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలకు టికెట్ ధరల పెంపుతో వచ్చిన ఆదాయం లో 20 శాతం ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలని నిర్మాతలను ప్రభుత్వం కోరింది. ఆ మొత్తాన్ని ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోd ¾యేషన’, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అకౌంట్లో జమ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా ఆయా సినిమాల నిర్మాతలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఏసీ, నాన్ ఏసీ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. దాని ప్రకారం నాన్-ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70.. ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100 ఉంటుంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150.. ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200 ఉంటుందని పేర్కొంది.
ఇక స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ రేట్లు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250.. ప్రీమియం రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300 ఉండేలా నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌లలో రెగ్యులర్ టికెట్ల రేటు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250.. రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300గా ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలానే థియేటర్ల నిర్వహణ, అదనపు షోలు, భారీ బడ్జెట్ చిత్రాలు, ఫెస్టివల్ సీజన్స్ లో మీడియం బడ్జెట్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం జీవోలో ప్రస్తావించింది. ప్రతి థియేటర్లో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఐదు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక షోలో చిన్న సినిమా ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. పరిమిత బడ్జెట్‌తో తీసే చిన్న సినిమాలకూ పండుగల సమయంలో ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. రూ.100 కోట్లకుపైగా పెట్టుబడితో తీసే సినిమాలను సూపర్ హై బడ్జెట్ చిత్రాలుగా పేర్కొంది. వాటికి మొదటి 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అలానే సినీ కార్మిక సంక్షేమ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చే సినిమాలకే టికెట్ ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది.
మల్టీప్లెక్స్‌లు సహా ప్రతి థియేటర్లో పేద, మధ్య తరగతి ప్రేక్షకుల కోసం 25 శాతం సీట్లు కేటాయిం చాలని ప్రభుత్వం జీవోలో తెలిపింది. అంటే 25 శాతం నాన్ ప్రీమియం సీట్లు ఉండాలి. అయితే ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్‌లో ఏసీ థియేటర్లకు రూ.5, నాన్-ఏసీ థియేటర్లకు రూ.3 నిర్వహణ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఎయిర్ కూల్డ్ థియేటర్లను రాబోయే రెండేళ్లలో ఏసీ థియేటర్లుగా మార్చుకోవాలని సూచించింది. 7.1 సౌండ్ సిస్టమ్, 2ఖ/4ఖ ప్రొజెక్షన్, కనీసం 75 అడుగుల స్క్రీన్ ఉండే సినిమా హాళ్లను స్పెషల్ థియేటర్లుగా గుర్తించనున్నట్లు తెలిపింది.
ఎగ్జిబిటర్ల అభ్యంతరం.. ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి
తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల సవరణకు సంబంధించి జారీ చేసిన జీవో నెం. 77 పై తెలంగాణ ఎగ్జిబిటర్లు మరియు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. చిన్న పట్టణాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ దెబ్బతింటుందని ఛాంబర్ ఆందోళన చెందుతోంది. ఈ ఉత్తర్వులను వెంటనే పునఃసమీక్షించాలని కోరుతూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాయడంతో పాటు, పరిశ్రమ భాగస్వాములతో విస్తృత చర్చల కోసం కన్సల్టేటివ్ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి, వాటికి అనుగుణంగా సినిమా టికెట్లకు కొత్త రేట్లు నిర్ణయించింది. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ రేట్లు సవరిస్తూ జారీ చేసిన జీవోను థియేటర్ల యాజమాన్యాలు ఖండించాయి. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. 10 రోజుల గడువు ఇచ్చి, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపింది.
మరోవైపు సినిమా థియేటర్ల టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 77పై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. హోం శాఖ ఉత్తర్వులను పునఃసమీక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. టికెట్ ధరల నిర్ణయంపై ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అన్ని ప్రధాన భాగస్వాములతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని ఛాంబర్ కోరింది. స్పెషల్ కేటగిరీ థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లపై ఎఫెక్ట్ పడుతుందని.. ముఖ్యంగా చిన్న పట్టణాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని థియేటర్ల మనుగడపై ప్రభావం పడే అవకాశం ఉందని ఛాంబర్ ఆందోళన వ్యక్తం చేసింది.
సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ థియేటర్ల వర్గీకరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాసింది. ఈ విషయంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరింది. సినీ ప్రతినిధులతో కన్సల్టేటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని అభ్యర్థించింది. పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే సంబంధిత వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడటంతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి పాటుపడటమే తమ లక్ష్యమని లేఖలో పేర్కొంది.








