యెషనాగులతో మరోసారి వైరల్‌గా మారిన కీర్తి సురేష్
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్(The Paradise) పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలోని యెష నాగుల(Yesha Nagula) సాంగ్ రిలీజ్ తో ఆ క్రేజ్ మరింత పెరిగింది. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ ఫోక్ నంబర్లో కీర్తి సురేష్(Keerthy Suresh) స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆగస్టు 29న రిలీజైన ఈ సాంగ్ కేవలం 20 గంటల్లోనే 20 మిలియన్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ సాధించి, మ్యూజిక్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే వ్యూస్‌తో పాటు కీర్తి సురేష్ లుక్, డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
సాంప్రదాయ లంగా వోణీలో కనిపించిన కీర్తి.. పాటలో తన గ్రేస్‌తో ఆకట్టుకుంది. సాధారణంగా స్పెషల్ డాన్స్ నంబర్స్‌లో కనిపించే గ్లామర్ టెంప్లేట్‌కు భిన్నంగా, యెష నాగులలో ఆమెను మరింత నేచురల్‌గా, సంప్రదాయబద్ధంగా ప్రజెంట్ చేయడం స్పెషల్ గా నిలిచింది. ముఖ్యంగా నాని, కీర్తి సురేష్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. నేను లోకల్(Nenu Local), దసరా(Dasara) తర్వాత వీరిద్దరి కలయిక కావడంతో ఫ్యాన్స్‌లోనూ ఈ సాంగ్‌పై ఆసక్తి పెరిగింది. ఇద్దరి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ సాంగ్‌కు మరింత ఊపునిచ్చింది.
ఇక ది ప్యారడైజ్ లో కీర్తి సురేష్ డాన్స్ నంబర్ చేస్తుందనే వార్త బయటకు వచ్చినప్పుడే ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. కీర్తికి మంచి పాత్రలు రావడం లేదంటూ ఓ నెటిజన్ విమర్శించగా, ఆ వ్యాఖ్యలో ది ప్యారడైజ్ ను కన్నడ సినిమాగా పేర్కొనడం కూడా డిస్కషన్‌కు దారితీసింది. దీనిపై కీర్తి తమిళంలో చమత్కారంగా స్పందిస్తూ, నాని నటిస్తున్నది తెలుగు సినిమా.. కన్నడ కాదంటూ కరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు యెష నాగులకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆ విమర్శలకు సమాధానం పాటతోనే వచ్చినట్టుగా కనిపిస్తోంది.








