George Krish: జార్జి క్రిష్ మూవీ లేటెస్ట్ అప్డేట్
టాలీవుడ్లో కొత్త కాంబినేషన్‌గా ఆసక్తిని రేకెత్తిస్తున్న హీరో శర్వానంద్(Sharwanand)- డైరెక్టర్ శ్రీను వైట్ల(Srinu Vaitla) ప్రాజెక్ట్ జార్జ్ క్రిష్(George Krish) తాజాగా మరో కీలక అప్డేట్తో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాపై పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఏప్రిల్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్లోనే శర్వానంద్‌కు సంబంధించిన ఎంట్రీ సీన్స్‌ను షూట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తై, టీమ్ షూట్‌కు రెడీ అయిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక హీరోయిన్ విషయానికొస్తే, ఈ మూవీలో రుక్మిణీ వసంత్(rukmini vasatnh)ను ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కొత్త జోడీగా శర్వానంద్- రుక్మిణీ వసంత్ కెమిస్ట్రీపై అందరికీ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం శర్వానంద్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని కొత్త స్టైల్లో కనిపించబోతున్నాడని సమాచారం. కథకు తగ్గట్టుగా శర్వా(Sharwa) పాత్రలో ప్రత్యేకమైన వైవిధ్యం ఉండేలా డైరెక్టర్ శ్రీను వైట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మరోవైపు, గోపీచంద్(gopichand)తో శ్రీను వైట్ల(Srinu Vaitla) తెరకెక్కించిన యాక్షన్ కామెడీ విశ్వం(Viswam) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ఈసారి హిట్ కోసం ఆయన మరింత శ్రద్ధ పెట్టుతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) జార్జ్ క్రిష్ సినిమాను నిర్మిస్తుండగా, కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.
ఇవి కూడా చదవండి








