Srinu Vaitla: హిట్ హీరోను పట్టేసిన శ్రీను వైట్ల
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల(Srinu Vaitla) గత కొన్ని సినిమాలుగా హిట్ అనేది చూడలేదు. రీసెంట్ టైమ్స్ లో ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపులుగా నిలవడంతో ఆయన ఫామ్ లో లేకుండా పోయాడు. దీంతో శ్రీను వైట్లతో సినిమాలు చేయడానికి హీరోలు, నిర్మాతలు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎట్టకేలకు గోపీచంద్(Gopichand) ను ఒప్పించి విశ్వం అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తే అది కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల వేరే నిర్మాతల చేతికి వెళ్లింది. మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజైన విశ్వం(Viswam) నెగిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో మళ్లీ శ్రీను వైట్ల కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆయన సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా ప్రాజెక్టు మాత్రం సెట్ అవలేదు.
అయితే ఇప్పుడు శ్రీను వైట్ల తన తర్వాతి సినిమాను శర్వానంద్(Sharwanand) తో ఫిక్స్ చేసుకున్నట్టు అధికారిక ఇన్ఫర్మేషన్ వెల్లడైంది. నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari) సక్సెస్ మీట్ లో శర్వానంద్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ, తన తర్వాతి సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ లో ఉంటుందని, ఆ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానుందని శర్వా వెల్లడించాడు. మరి ఫామ్ లో లేని వైట్ల, శర్వాకు ఎలాంటి సినిమాను ఇస్తాడో చూడాలి.






