Kodi Pandhello: కోడిపందేల్లో లక్కీ డ్రా లో : బుల్లెట్ బండి
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కోడి పందేల్లో ఓ వ్యక్తి బుల్లెట్ బండి (Bullet bike) దక్కించుకున్నాడు. లక్కీ డ్రాలో రూ.2.50 లక్షల విలువ చేసే బైక్ను కైవసం చేసుకున్నాడు. మచిలీపట్నం (Machilipatnam) మంగినపూడి బీచ్ రోడ్డులోని ఓ బరిలో నిర్వాహకులు లక్కీ డ్రా తీశారు. ఒక్కో కూపన్ రూ.500కు విక్రయించారు. చివరి రోజు పందేలు ముగిసిన తర్వాత డ్రా తీశారు. ఇందులో ఆకుల సతీష్ (Akula Satish) అనే వ్యక్తికి బుల్లెట్ బండి వరించింది. సెకండ్ లక్కీ డ్రా విజేతకు డబుల్ డోర్ ఫ్రిజ్ (Double door fridge) అందజేశారు. మొత్తం ఐదుగురు లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేశారు.






