Corporation: మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
తెలంగాణలో కార్పొరేషన్ (Corporation) మేయర్లు, మున్సిపల్ (Municipal) చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి (Sridevi) తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ( జనరల్)కి కేటాయించారు. రామగుండం- ఎస్సీ (జనరల్), మహబూబ్‌నగర-`బీసీ ( మహిళ), మంచిర్యాల- బీసీ (జనరల్), కరీంనగర్బీ-సీ (జనరల్) జీహెచ్ఎంసీ -మహిళా జనరల్, గ్రేటర్ వరంగల్ -జనరల్, ఖమ్మం కార్పొరేషన్ -మహిళ జనరల్, నల్గొండ కార్పొరేషన్- మహిళా జనరల్, నిజామాబాద్ కార్పొరేషన్ – మహిళా జనరల్ కు కేటాయించారు.






