Revanth Reddy: సీఎంగా 2034 వరకు గ్యారంటీగా ఉంటా: రేవంత్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని, ఆ విషయంలో తనకు స్పష్టమైన అవగాహన ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదిక (Shilpakala Vedika)లో గ్రూప్-3 (Group-3) ఉద్యోగాలు పొందిన 1,370 మందికి సీఎం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ సీఎంగా తాను 2034 వరకు గ్యారంటీగా ఉంటానని, రాష్ట్ర యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సాధించేలా నైపుణ్య శిక్షణ ఇప్పించి తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం భూమి లేనివారికి భూములు, గిరిజనులకు పోడుపట్టాలు ఇచ్చిందని, ప్రస్తుతం భూముల్లేవని నాణ్యమైన విద్య అందించాలన్నదే తమ ఏకైక లక్ష్యమని వెల్లడిరచారు. 2014 నుంచి 2923 వరకు రెండుసార్లు సీఎంగా పనిచేసిన వారు కుటుంబ, రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశారని, ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన చేయలేదని ఆరోపించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






