Chandrababu: తిరుపతిలో ఏపీ ఫస్ట్ పరిశోధన కేంద్రం : చంద్రబాబు
తిరుపతి కేంద్రంగా అతిపెద్ద ఏపీ ప్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ( ఏపీ ఫస్ట్) పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆమోదం తెలిపారు. తిరుపతి (Tirupati)లోని ఐఐటీ ఐఐఎస్ఈఆర్ (IISER) వంటి ప్రముఖ జాతీయ విద్యా సంస్థల భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. యువత భవిష్యత్తు తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వారికి అన్ని విధాలా సహకరించాలని అధికారులకు సూచించారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ ( IT), డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. వివిధ రంగాల్లో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఏరో స్పేస్ (Aerospace), డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ డివైసెస్, సెన్సర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, హెల్త్‌కేర్, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాలసీలు రూపొందిస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రోత్సహిస్తోంది. దేశంలో తొలిసారి గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలు, వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాలి. భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలు, స్టార్టప్‌లను ప్రోత్సహించాలి. ఏపీ ఫస్ట్‌ను సమర్థంగా నిర్వహించేందుకు కేంద్రంతోనూ సంప్రదింపులు జరపాలి అని పేర్కొన్నారు.






