Dhanush, Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ వివాహం.. తేదీ ఖరారు!?
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వీరిద్దరూ వచ్చే నెల ఫిబ్రవరి 14న, అంటే ప్రేమికుల రోజున ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
వదంతులకు కారణం..
ధనుష్, మృణాల్ మధ్య ప్రేమాయనం నడుస్తోందనే ఊహాగానాలు 2025 ఆగస్టు నుంచి మొదలయ్యాయి. అప్పట్లో మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ షోకు ధనుష్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ధనుష్ నటిస్తున్న తేరే ఇష్క్ మే సినిమా రాప్ అప్ పార్టీలో కూడా మృణాల్ కనిపించడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అంతేకాకుండా, మృణాల్ సోషల్ మీడియాలో ధనుష్ సోదరీమణులను ఫాలో అవుతుండటం కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి, ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
అసలు నిజం ఏంటి?
అయితే, ఈ పెళ్లి వార్తలపై ధనుష్ లేదా మృణాల్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కూడా ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు మృణాల్ వాటిని కొట్టిపారేస్తూ, ధనుష్ తనకు ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని స్పష్టం చేశారు. తాజా సమాచారం ప్రకారం, మృణాల్ ఠాకూర్ కి ఫిబ్రవరిలో ఒక సినిమా విడుదల ఉండటంతో పాటు మార్చిలో మరొక తెలుగు సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. షూటింగ్ షెడ్యూల్స్ మరియు సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సమయంలో పెళ్లి చేసుకునే అవకాశం లేదని ఆమె సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. ధనుష్ తరపు నుంచి కూడా ఈ వార్తలు నిరాధారమైనవని, కేవలం స్నేహాన్ని పెళ్లిగా చిత్రీకరిస్తున్నారని కొందరు కొట్టిపారేస్తున్నారు.
ధనుష్ 2022లో తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ధనుష్ తన కెరీర్, పిల్లల పెంపకంపైనే దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు మృణాల్ తో పెళ్లి వార్తలు రావడంతో దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.






