Naga Vamsi: ఆరేళ్ల తర్వాత ఈ సంక్రాంతి కలిసొచ్చింది
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ లో పలు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో నవీన్ పోలీశెట్టి(Naveen Polishetty) హీరోగా నటించిన అనగనగా ఒక రాజు(Anaganaga Oka raju) సినిమా కూడా రిలీజైంది. మంచి మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ దిశగా దూసుకెళ్తుంది ఈ మూవీ. మారి(Maari) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటించగా, చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది.
ఈ సినిమాకు నిర్మాత నాగవంశీ(Naga Vamsi) అనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని సినిమాలుగా నాగ వంశీ బ్యానర్ లో వచ్చిన సినిమాలు ఫ్లాపవుతున్నాయి. దీంతో నాగవంశీ కాస్త డిజప్పాయింట్ అయ్యాడు. అందుకే అనగనగా ఒక రాజు సినిమా సక్సెస్ అయిన సంతోషంలో నాగ వంశీ(Naga Vamsi) మంచి జోష్ లో ఉన్నాడు. ఈ సందర్భంగా ఆరేళ్ల తర్వాత ఈ సంక్రాంతి తనకు చాలా సంతృప్తినిచ్చిందని, దానికి కారణం అనగనగా ఒక రాజు సినిమానే అని చెప్పాడు నాగవంశీ.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తో చేసిన అల వైకుంఠపురములో(Ala Vaikunthapurramulo) సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ సంక్రాంతికి తమకు రాలేదని, గతేడాది టెక్నికల్ గా డాకు మహారాజ్(Daku Maharaj) లాంటి అద్భుతమైన సినిమా తీసినా, డిస్ట్రిబ్యూటర్లకు ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదని, కానీ ఈసారి తమకు మంచి రిజల్ట్ వచ్చిందని, ఆడియన్స్ ఇచ్చిన ప్రోత్సాహం చాలా ఆనందాన్నిచ్చిందని వంశీ చెప్పాడు.






