NNNM: ‘నారీ నారీ నడుమ మురారి’కి యునానిమస్ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: శర్వా
చార్మింగ్ స్టార్ శర్వా సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ మీట్ నిర్వహించారు.
సంక్రాంతి విన్నర్ మీట్ హీరో శర్వా మాట్లాడుతూ… అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. హిట్ కొడతానని చెప్పాను. చెప్పి కొట్టాను. ఇది గర్వంతోనో పొగరుతో మాట్లాడటం లేదు. చాలా హంబుల్ గా చెప్తున్నాను. హిట్టు కొడతానని అంత నమ్మకంగా చెప్పడానికి కారణం ఈ కథ. రామ్, నందు, భాను వాళ్లు రాసిచ్చిన కథ మొదటి రోజు నుంచే నాకు ఎంతో నమ్మకాన్ని కలిగించింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా బ్లాక్ బస్టర్ అవుతుందని అనిల్ గారికి ముందే చెప్పాను. సంక్రాంతి అనేది రెవెన్యూ పరంగా 40, 50% పెరుగుతుంది. నేను కూడా సంక్రాంతికి రావాలనుకున్నాను. దాన్ని నెరవేర్చింది అనిల్ గారే. రామ్ అబ్బరాజు లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి కావాలి. తను ప్రొడ్యూసర్ డైరెక్టర్. నాకు కథ ఎలా చెప్పాడో అంతకంటే అద్భుతంగా తీశాడు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఆ హిట్ ఇచ్చిన రామ్ కి థాంక్ యూ. భాను నందు అద్భుతంగా రాశారు. ఎక్కడ బోర్ కొట్టించకుండా అద్భుతమైన మాటలు రాశారు. యువరాజ్ చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ చేశారు.
అనిల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో అందరూ కూడా ఆయన్ని మంచి ప్రొడ్యూసర్ అంటారు. ఆయన ఒక బ్రదర్ లాగా నిల్చున్నారు. ఈ సినిమాని ఎంత కష్టపడి తీశారో ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు. మా జర్నీ కొనసాగుతుంది. దిల్ రాజుగారి సపోర్టు నాకు ఎప్పుడు ఉంటుంది. ఆయన తక్కువ థియేటర్లు అని చెప్పారు. మాకు తెలిసే రిలీజ్ చేశాం. మంచి సినిమా ఇచ్చాం, మంచి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వారి చేతుల్లో పెడుతున్నాను వాళ్ళు చూసుకోవాలి. ఇలాంటి గోల్డెన్ హాండ్స్ ఉన్నప్పుడు నాకు ఆలోచించి టెన్షన్ పడాల్సిందేమీ లేదు.
సంయుక్త వండర్ఫుల్ కోస్టార్, తన అందరికీ హిట్స్ ఇస్తుంది అని చెప్తుంటారు. నాకు హిట్ ఇచ్చినందుకు థాంక్యూ( నవ్వుతూ ). సాక్షి వైద్య కూడా చాలా అద్భుతంగా నటించింది. నరేష్ గారు ఈ సినిమాకి మరో హీరో. మా నాన్నగారి క్యారెక్టర్ లో చేశారు. ఆయన సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే విపరీతంగా నవ్వుకునేవాళ్ళం. అందరు కూడా చాలా రోజుల తర్వాత ఇంతలా నవ్వుకున్నామని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇంకా కష్టపడతాను. ఇంకా మంచి సినిమాలు చేస్తాను. ఆ దేవుడే నన్ను ముందుకు తీసుకెళ్తాడని నమ్ముతున్నాను. సంక్రాంతికి అన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి. మన బాస్ సినిమా అద్భుతంగా ఆడుతుంది.అలాగే అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి సినిమా, అలాగే వచ్చిన సినిమాలు అన్నిటికీ ఆల్ ది వెరీ బెస్ట్.
నేను ఎప్పుడు సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు ఆడుతాయి. ఎక్స్ ప్రెస్ రాజా వచ్చినపుడు కూడా అన్ని సినిమాలు ఆడాయి. శతమానం భవతి సమయంలో కూడా అన్ని సినిమాలు ఆడాయి. ఇప్పుడు కూడా అన్ని సినిమాలు ఆడుతున్నాయి. సో.. శర్వా సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు బాగుంటాయి. కచ్చితంగా నా కోసం ఒక స్లాట్ పక్కన పెట్టండి. నెక్స్ట్ సంక్రాంతి మళ్లీ వస్తున్నాను. శ్రీనువైట్ల గారు, మైత్రి మూవీ మేకర్స్ మా కాంబినేషన్ లో నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. శర్వా శతమానం భవతి గతంలో సంక్రాంతి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. ఈ సినిమా ఇంకా చాలామంది చూడాలి. చాలా మంచి సినిమా ఇది. సినిమాకి మీడియా నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి చివరిలో రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి స్క్రీన్సు తక్కువగానే ఉన్నాయి. నైజం, వైజాగ్ లో రిలీజ్ చేసిన మేము కూడా 100% థియేటర్స్ ఇవ్వలేకపోయాం. కాకపోతే సెకండ్ వీక్ నుంచి ఫుల్లుగా ఈ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కాబోతోంది. డైరెక్టర్ సాయి రెండు హిట్లు కొట్టాడు. హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను. శర్వా నెక్స్ట్ మూవీ బైక్ టీజర్ అదిరిపోయింది. ఆ సినిమా కోసం వెయిటింగ్. అనిల్ గారు అంటే మా అందరికి ఇష్టం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారి అద్భుతంగా ఆడుతోంది. ఆ టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. అలాగే సితార నుంచి వచ్చిన అనగనగా ఒక రాజు కూడా సూపర్ హిట్ అయింది. ఈ సంక్రాంతికి మేము రిలీజ్ చేసిన మూడు సినిమాలు కూడా హ్యాట్రీక్ ఆనందంగా వుంది. 99లో ఆఫీస్ పెట్టినప్పుడు ఒకే ఒక్కడు సఖి నువ్వు వస్తావని సినిమాలతో డిస్ట్రిబ్యూటర్ హ్యాట్రిక్ కొట్టాం. ఇప్పుడు మళ్ళీ హ్యాట్రిక్ అందుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ ముగ్గురు నిర్మాతలు కూడా థాంక్యూ సో మచ్. ఈ సినిమాలు మా ద్వారా రిలీజ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది.
డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాకి అద్భుతమైన సపోర్ట్ ఇచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు. ఈ సినిమా డైరెక్టర్ అద్భుతంగా తీశారు. వాళ్ళది హిట్ కాంబినేషన్ అన్ని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి సపోర్ట్ చేసి బిగ్ సక్సెస్ ఇచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సక్సెస్ చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా కథ విన్నప్పుడే సూపర్ హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత మా నమ్మకం నిజమైంది అనిపించింది. ఆడియన్స్ సినిమాని హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ గారు అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ ని తీర్చిదిద్దారు. అన్ని క్యారెక్టర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో అన్ని ట్రాక్స్ బాగున్నాయని ఆడియన్స్ చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అందరూ కూడా యునానిమస్ విన్నర్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది.
డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. శర్వా గారు చెప్పి మరి హిట్టు కొట్టారు. ఆడియన్స్ థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన స్క్రిప్ట్ విషయంలో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఆయన తో వర్క్ చేయడం చాలా ఫన్. ఆయన నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. నిజంగా ఇంత సపోర్ట్ నేను ఊహించలేదు. ఆయన నాకు ఒక బ్రదర్ లాగా అయ్యారు.
ఈ సినిమా రిజల్ట్ తర్వాత ఆయన్ని కలిసిన మూమెంట్ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను.అందరు కూడా రైటింగ్ ని మెచ్చుకుంటున్నారు. భాను నందుకి థాంక్. మాకు సంక్రాంతి విజయం విజయం ఇచ్చిన అనిల్ గారికి థాంక్యూ. ఇకపై వారి బ్యానర్లో అన్ని విజయాలే రావాలని కోరుకుంటున్నాను. సంయుక్త ఫస్ట్ డే నుంచి చాలా సపోర్ట్ చేసింది. మొదటి నుంచి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేది. తను ఈ సినిమాకి లక్కీ. సాక్షి చాలా అద్భుతంగా చేసింది. నరేష్ గారు క్యారెక్టర్ కోసం ఏదైనా చేస్తారు. ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోరు. అదే ఈరోజు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇందులో కామియో రోల్ చేసిన శ్రీవిష్ణు గారికి థాంక్యూ. వైట్ల గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఈ సినిమాని సంక్రాంతి విన్నారని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ప్రెస్ షో అయిపోయిన వెంటనే వచ్చిన కాల్స్ నా జీవితంలో ఎప్పుడూ రాలేదు. అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శర్వా, నరేష్ గారు, సునీల్, ప్రతి ఒక్కరి పర్ఫామెన్స్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నరేష్ గారైతే అదరగొట్టేసారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వేస్తున్నారు. ప్రతి సీను హిలేరియస్ గా వచ్చింది. నెక్స్ట్ మూడు వారాలు నారీ నారీ నడుమ మురారి సందడే ఉండబోతోంది. ఈ సినిమా బిగినింగ్ నుంచి మాకు చాలా నమ్మకం ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అని శర్వా మాకు ముందు నుంచే చెప్తుండేవారు. మార్నింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కాల్ చేశారు. అది బెస్ట్ కాంప్లిమెంట్. సినిమా ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.






