Kollywood: కోలీవుడ్ కు డిజాస్టర్ గా మిగిలిన పండగ సీజన్
సౌత్ ఇండస్ట్రీలో సంక్రాంతి అనేది చాలా మంచి సీజన్. సెలవులుంటాయి కాబట్టి ఆ టైమ్ లో సినిమాలను రిలీజ్ చేస్తే చూడ్డానికి ఆడియన్స్ వస్తారనేది మేకర్స్ ప్లాన్. అందుకే తమ సినిమాలను చాలా ముందునుంచే సంక్రాంతి సీజన్ ను ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సంక్రాంతికి పలు సినిమాలు రిలీజవుతూ ఉంటాయి
అయితే ఈ ఇయర్ సంక్రాంతికి తమిళ ఇండస్ట్రీలో రెండు సినిమాలు రిలీజవడానికి రెడీ అయ్యాయి. వాటిలో ఒకటి విజయ్(Vijay) జననాయగన్(Jana Nayagan) కాగా, రెండోది శివ కార్తికేయన్(Siva Karthikeyan) పరాశక్తి(Parasakthi). కానీ వాటిలో విజయ్ సినిమా సెన్సార్ ఇబ్బందుల వల్ల వాయిదా పడింది. దీంతో పరాశక్తికి ఫ్రీ గ్రౌండ్ దొరికింది. ఈ స్పేస్ ను వాడుకుని అమరన్ హీరో బాక్సాఫీస్ ను దుల్లగొడతాడని అందరూ అనుకుంటే సీన్ రివర్స్ అయింది.
జనవరి 10న రిలీజైన పరాశక్తి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏ సినిమాలూ లేకపోయినా ఆడియన్స్ ఈ సినిమా చూడ్డానికి రావడం లేదు. ఇక ఈ రెండు సినిమాల సిట్యుయేషన్ ను చూసుకుని కార్తి(Karthi) వా వాతియార్(Vaa vaathiyar) ను సడెన్ గా రిలీజ్ చేశారు. సరైన ప్రమోషన్స్ లేక సడెన్ గా రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా రాలేదు. మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ చెప్పుకోదగిన హిట్ గా అయితే ఈ సినిమా కూడా నిలిచేలా లేదు. మొత్తానికి ఈ ఏడాది సంక్రాంతి కోలీవుడ్ కు కలిసిరాలేదనే చెప్పాలి.






