AR Rahman: రామాయణ వర్కింగ్ ఎక్స్పీరియెన్స్ గురించి రెహమాన్
రణ్బీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి(Sai Pallavi) జోడీగా బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా రామాయణ. ప్రముఖ ఇతిహాసం రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, ఈ సినిమాకు ఆస్కార్ విజేతలైన ఏఆర్ రెహమాన్(AR Rahman), హాన్స్ జిమ్మెర్(Hans Zimmer) సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే రామయణ నుంచి టీజర్ రిలీజవగా ఆ టీజర్ కు ఆడియ్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూశాక ఆడియన్స్ లో ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెహమాన్ ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియెన్స్ గురించి మాట్లాడారు. రామాయణకు వర్క్ చేయడం చాలా పెద్ద బాధ్యత అని, దాని వెనుక చాలా క్రియేటివ్ ఛాలెంజెస్ ఉన్నాయని ఆయన చెప్పారు.
రామాయణకు వరల్డ్ వైడ్ గా చాలా ప్రాముఖ్యత ఉందని, అందుకే దీని కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది చాలా క్రిటికల్, ఎమోషనల్ గా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ మూవీ ఇండియన్ సినిమా సరిహద్దులను దాటుతుందని కూడా రెహమాన్ అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రామయణ వర్కింగ్ ఎక్స్పీరియెన్స్ టెర్రిఫిక్ అని ఆయన చెప్పారు.






