Dhanush: వాలెంటైన్స్ డే రోజున ధనుష్- మృణాల్ పెళ్లి
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) డేటింగ్ చేస్తున్నారనే వార్తలు ఎప్పట్నుంచో వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సదరు హీరోహీరోయిన్ ఎవరూ అఫీషియల్ గా చెప్పకపోయినా గాసిప్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.
గతేడాది ఆగస్ట్ లో సన్నాఫ్ సర్దార్2(Son of sardar2) ప్రీమియర్ కు ధనుష్, మృణాల్ హాజరవగా ఆ ప్రీమియర్ కు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. అప్పట్నుంచి వీరిద్దరి డేటింగ్ వార్తలు బాగా ఎక్కువయ్యాయి. ఈ విషయం గురించి మృణాల్ ను అడగ్గా, తనకు ధనుష్ ఒక మంచి స్నేహితుడు అని, తన కో స్టార్ అజయ్ దేవగణ్(Ajay Devgan) పిలిచినందుకే ధనుష్ వచ్చారని మృణాల్ స్పష్టం చేసింది.
అయినప్పటికీ వారిద్దరి డేటింగ్ వార్తలు ఆగలేదు. తాజాగా ఓ మీడియా నివేదిక ప్రకారం ధనుష్ మరియు మృణాల్ ఫిబ్రవరి 14 వేలెంటైన్ డే నాడు పెళ్లి చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయంలో క్లారిటీ లేదు కానీ ఇన్సైడ్ సోర్సెస్ అయితే నిజమేనంటున్నాయి. టెలివిజన్ నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన మృణాల్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ స్టార్ గా ఎదగ్గా, ధనుష్ ఇప్పటికే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.






