Tom Hiddleston: రాజమౌళి ఎక్స్లెంట్ అంటున్న టామ్
హాలీవుడ్ నటుడు టామ్ హిడిల్స్టన్(Tom hiddleston) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన యాక్టింగ్ తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న టామ్ రీసెంట్ గా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ సినిమాపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని, ఇండియన్ మూవీస్ తో తన మొదటి అనుభవాన్ని వ్యక్తపరిచారు.
తానెంతో కాలంగా ఇండియన్ మూవీస్ ను ఇష్టపడుతున్నానని, తాను ఫస్ట్ చూసిన ఇండియన్ సినిమా దేవదాస్(Devadas) అని చెప్పారు. సంజయ్ లీలా భన్సాలీ(Sanjay leela bhansali) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్(Shah rukh khan) హీరోగా, ఐశ్వర్యా రాయ్(Aishwarya raai), మాధురి దీక్షిత్(Madhuri Dixit) హీరోయిన్లుగా వచ్చిన దేవదాస్ ఎంత మంచి సక్సెస్ అయిందో తెలిసిందే. 2002లో వచ్చిన దేవదాస్ సినిమానే తాను మొదటిగా చూసిన ఇండియన్ సినిమా అని టామ్ చెప్పారు.
ఇంటర్వ్యూలో భాగంగా మీ డ్రీమ్ కొలాబరేషన్ ఏంటని అడిగితే, టామ్ హిడిల్స్టన్ ఆలోచనలో పడగా, ఈ లోపు రాజమౌళి(Rajamouli)పేరు వినగానే వెంటనే ఆయన ఎక్స్లెంట్ అని టామ్, జక్కన్న(Jakkanna) ను ప్రశంసించారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వారణాసి అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న రాజమౌళి, టామ్ మాటల్ని విని ఫ్యూచర్ లో అతన్ని ఏదైనా సినిమా కోసం తీసుకుంటారేమో చూడాలి.






