NTRNeel: డ్రాగన్ షూటింగ్ పై కొత్త అప్డేట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డ్రాగన్(Dragon). ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ నీల్(NTRNeel) అనే వర్కింగ్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. డ్రాగన్ పై మొదటి నుంచి అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఒకటి తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డ్రాగన్ ఇప్పటికే పలు షెడ్యూల్స్ షూటింగ్ ను పూర్తి చేసుకోగా కొత్త షెడ్యూల్ ఇవాళ నుంచి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో మొదలవనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ తర్వాతి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనుందట.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
డ్రాగన్ సినిమాలోని కీలక సన్నివేశాలను జోర్డాన్ లో షూట్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే టీమ్ జోర్డాన్ వెళ్లి షూటింగ్ కోసం పలు లొకేషన్లను కూడా వెతికి వచ్చింది. రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్(Ravi Basrur) సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2026 సెకండాఫ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






