Speaker: మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్!
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Gaddam Prasadkumar) క్లీన్చిట్ ఇచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy), చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య (Kale Yadiah)లపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. వారిద్దరూ పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వారిని బీఆర్ఎస్ (BRS) పార్టీ సభ్యులుగానే పరిగణనలోకి తీసుకున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. పార్టీ మారినట్లు ఆధారాలు సమర్పించడంలో ఫిర్యాదుదారులు విఫలమైనట్లు తెలిపారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తమే ముఖ్యమంత్రిని కలిసినట్లు వివరించారన్నారు. సాంకేతికంగా వారిప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారని వెల్లడించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






