Vemulawada: వేములవాడ ఆలయ అభివృద్ధికి సీఎం శ్రీకారం: మంత్రి సీతక్క
వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) శ్రీకారం చుట్టారని రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. రాజన్న అనుబంధ భేమేశ్వర ఆలయంలో స్వామి వారిని మంత్రి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో (Adi Srinivas) కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. వేములవాడలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఆలయాల అభివృద్ధి, భావోద్వేగాలు, ఆచారాలతో ముడిపడి ఉంది. ఈ నెల 18న మేడారంలో క్యాబినెట్ భేటీ జరుగుతుంది. 19న మేడారం ఆలయాన్ని సీఎం పున ప్రారంభిస్తారు. పుష్కరాల దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






