Bandi Sanjay: ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్ కు ఎందుకింత అక్కసు : బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ-జీ రామ్‌జీ పథకం అద్భుతం అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కచ్చితంగా 125 రోజుల పని దొరుకుతుంది. వ్యవసాయ సీజనలో కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం ఉపశమనం కల్పించబోతుంది. గతంతో పోలిస్తే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.17 వేల కోట్లు కేటాయించబోతోంది. తెలంగాణ రాషా్ట్రనికి రూ.340 కోట్లు అదనంగా వస్తాయి, ఇంత గొప్ప పథకం ఎందుకు వద్దు, ఈ పథకాన్ని అడ్డుకోవాలని చూడటం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనం అని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఉపాధి హామీ పథకానికి గాంధీ (Gandhi) పేరును తీసేయడంపై కాంగ్రెస్ అవనసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ముందుగా ఈ పథకానికి మహాత్ముడి పేరు కాంగ్రెస్ పెట్టలేదని చెప్పారు. పాలకులు మారినపుడు పథకాల పేర్లు మారడం సహజమేనన్నారు. గతంలో వాల్మీకి, అంబేద్కర్ పేర్లతో వాజ్‌యేయి ప్రభుత్వం వాంబే స్కీం పేరుతో ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశపెడితే కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక వారి పేర్లను తొలగించి ఇందిరాగాంధీ ఆవాస్ యోజన పథకంగా మార్చిందని గుర్తు చేశారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరుండగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Rajiv Gandhi International Airport)గా నామకరణం చేసిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. వీబీ జీ రామ్‌జీ పథకం అనేది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామానికి దీర్ఘకాలిక ఆస్తులు కూడబెట్టేందుకు ఉద్దేశించినదని అన్నారు.






