Manchukonda: మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల
ఖమ్మం జిల్లాలోని మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ప్రారంభించారు. వి.వెంకటాయపాలెం వద్ద మంత్రి మోటర్ స్విచ్ ఆన్ చేసి జాతికి అంకితం చేశారు. ఈ పథకంతో రఘునాథపాలెం (Raghunathapalem), ఖమ్మం అర్బన్ (Khammam Urban) మండలాలకు సాగునీరు అందనుంది. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌తో 35 చెరువులు నింపేలా ఏర్పాట్లు చేశారు. సాగర్ జలాలను మళ్లించి రెండు పంటలకు సాగునీరు అందించేలా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీనికింద 2,412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.






