Rashmika Mandanna: సింపుల్ లుక్స్ లో మెరిసిపోతున్న నేషనల్ క్రష్
ఛలో(Chalo) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక(Rashmika) ప్రస్తుతం నేషనల్ క్రష్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటూ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా రష్మిక పర్సనల్ టైమ్ తీసుకుని ట్రిప్స్, వెకేషన్స్ కు వెళ్తూ ఉంటుంది. రీసెంట్ గా లండన్ కు వెళ్లిన రష్మిక అక్కడ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రష్మిక గ్రే, బ్లాక్ కలర్ స్ట్రైప్డ్ ఔట్ఫిట్ ధరించి, ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్ గా సూర్యుని వెలుగుల్లో మెరిసిపోతూ కనిపించింది. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లండన్ బ్రిడ్జ్, బిగ్ బెన్ ఆ ఫోటోలను మరింత స్పెషల్ గా మార్చగా అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






