Venky Pinky Jump: దర్శకుడు వి. సముద్ర, బెజవాడ బేబక్క సంయుక్తంగా విడుదల చేసిన “వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో
విక్రమ్, రమ్య హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా “వెంకీ పింకీ జంప్”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై వెంకట్, బాబా నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో దర్శకుడు అజయ్. యన్ రూపొందిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, బెజవాడ బేబక్క, ప్రముఖ దర్శకనిర్మాత సాయివెంకట్ ముఖ్య అతిథిలు గా హాజరై ఆడియో బిగ్ సీడీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా
నటుడు సతీష్ మాట్లాడుతూ – నేను “వెంకీ పింకీ జంప్” చిత్రంలో తండ్రి పాత్రలో నటించాను. ఈ సినిమా నటుడిగా నాకు మంచి పేరు తెస్తుంది. దర్శకుడు అజయ్ కు సినిమానే ప్రపంచం. ప్రొడ్యూసర్స్ వెంకట్, బాబా ప్యాషనేట్ గా నిర్మించారు. అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ బేబక్క మాట్లాడుతూ – హీరో విక్రమ్ మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది. ఈ మూవీకి ఆనంద్ రాజా గారు చేసిన సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ రమ్య బ్యూటిఫుల్ గా ఉంది. “వెంకీ పింకీ జంప్” మూవీ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ రాజా మాట్లాడుతూ – నేను ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించాను. పాటలు రాశాను. “వెంకీ పింకీ జంప్” చిత్రంతో మా అబ్బాయి విక్రమ్ ను హీరోగా పరిచయం చేస్తున్నందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడంతో పాటు సాంగ్స్ కు లిరిక్స్ రాశాను. వన్ టు త్రీ అనే సాంగ్ మీ అందరికీ బాగా నచ్చుతుంది. “వెంకీ పింకీ జంప్” సినిమాను మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో విక్రమ్ మాట్లాడుతూ – నేను అందంగా ఉండను. హీరోగా నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటుంటే ఎమోషనల్ అయ్యాను. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ అజయ్, ప్రొడ్యూసర్స్ వెంకట్, బాబా గారికి థ్యాంక్స్. హీరోగా మంచి పేరు తెచ్చుకుని మా నాన్న గర్వపడేలా చేస్తాను. నాకు ధైర్యం చెప్పి సపోర్ట్ గా నిలబడిన మా సినిమా టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(venkatesh) ఓ స్పెషల్ రోల్ చేశారు.
హీరోయిన్ రమ్య మాట్లాడుతూ – “వెంకీ పింకీ జంప్” చిత్రంలో పింకీ పాత్రలో నటిస్తున్నాను. హీరోయిన్ గా ఇది నాకు ఫస్ట్ మూవీ. మీ అందరి సపోర్ట్ తో మరిన్ని మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే కథా కథనాలతో మీ ముందుకు త్వరలో రిలీజ్ కు వస్తాం. అన్నారు
అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – “వెంకీ పింకీ జంప్” సాంగ్స్ బాగున్నాయి. హీరో విక్రమ్, హీరోయిన్ రమ్య, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రానికి నా వంతు సహకారం అందిస్తాను. సినిమా రిలీజ్ టైమ్ లో మంచి థియేటర్స్ ఇప్పిస్తానని మాటిస్తున్నాను. అన్నారు.
చిత్ర దర్శకుడు అజయ్ యన్ మాట్లాడుతూ – యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది. “వెంకీ పింకీ జంప్” టైటిల్ లోనే మీకు స్టోరీ ఎలా ఉండబోతుంది అర్థమై ఉంటుంది. వెంకీ పింకీ లవ్ చేసుకుంటారు. వాళ్లు తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఊరి నుంచి పారిపోతారు. ఆ తర్వాత వాళ్ల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరమైన కథా కథనాలతో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఈ చిత్రంలో ఆనంద్ రాజా గారి మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. అన్నారు.
అతిథిగా వచ్చిన డైరెక్టర్ వి.సముద్ర మాట్లాడుతూ – ఈ రోజు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. కంటెంట్ ముఖ్యం. ఒకప్పుడు హీరో ఆరడుగులు ఉండాలి, అందంగా ఉండాలని ప్రేక్షకులు కోరుకునే వారు. ఇప్పుడు వారి అభిరుచి మారిపోయింది. కంటెంట్ బాగుంటే సినిమాను ఆదరిస్తున్నారు. హీరో విక్రమ్, హీరోయిన్ రమ్య ఈ మూవీలో బాగా నటించారు. ఆనంద్ రాజా చేసిన సాంగ్స్ బాగున్నాయి. “వెంకీ పింకీ జంప్” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అన్నారు.






