Rishab Shetty: తెలుగు నిర్మాతకు రిషబ్ షాక్
దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు ఊరికే అనలేదు. పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పిన ఈ సామెతను తూ.ఛ తప్పకుండా పాటిస్తున్నాడు కన్నడ నటుడు రిషబ్ శెట్టి(Rishab Shetty). కాంతార(Kanthara) ఫ్రాంచైజ్ సినిమాలతో రిషబ్ క్రేజ్, మార్కెట్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. కాంతార ముందు వరకు కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన రిషబ్, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.
అందుకే ఇప్పుడు అతనితో సినిమాలు చేయడానికి ఎంతోమంది వెనుక పడుతున్నారు. ఆల్రెడీ జై హనుమాన్(Jai hanuman) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న రిషబ్ తో ఓ పూర్తి స్థాయి తెలుగు సినిమా చేయాలని టాలీవుడ్ నిర్మాత ఒకరు అతన్ని సంప్రదించగా, రిషబ్ ఆ సినిమాకు రూ.80 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అంత భారీ రెమ్యూనరేషన్ ఇచ్చే పరిస్థితులు లేవు.
ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఆలోచించి స్టార్ హీరోలందరూ తమ అప్ కమింగ్ సినిమాలకు రెమ్యూనరేషన్ ను తగ్గించుకుని సినిమాలు చేసి తర్వాత లాభాల్లో వాటాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటే, రిషబ్ మాత్రం భారీగా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి రిషబ్ చెప్పిన రేటుకు నిర్మాత ఓకే అనుకుని ముందుకెళ్తారా లేదా కేవలం ఒక్క నటుడికే అంత రెమ్యూనరేషన్ ఇస్తే ఇక బడ్జెట్ మొత్తం ఎంత అవుతుందని వెనుకడుగేస్తారా అనేది చూడాలి.






