Siva Karthikeyan: శివ కార్తికేయన్ ఖాతాలో మరో ఫ్లాపు
మొన్న ఏడాది దీపావళి టైమ్ లో వచ్చిన అమరన్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. గట్టి పోటీతో రిలీజైనప్పటికీ అమరన్(Amaran) మంచి విజయాన్ని అందుకుంది. అమరన్ తో వచ్చిన క్రేజ్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలని శివ కార్తికేయన్(Siva Karthikeyan) ఎంతో ప్రయత్నించినప్పటికీ అది కుదరడం లేదు. అమరన్ తర్వాత అతని ఖాతాలో ఒక్క సక్సెస్ కూడా లేదు.
ఎన్నో ఆశలు పెట్టుకుని మురగదాస్(Murugadoss) దర్శకత్వంలో శివ కార్తికేయన్ చేసిన మదరాసి(Madarasi) సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. తమిళంలో ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి కానీ తెలుగులో మాత్రం అస్సలేమాత్రం కలెక్షన్లు తెచ్చుకోలేకపోయింది. ఫలితంగా శివ కార్తికేయన్ ఖాతాలో ఫ్లాపు నమోదైంది. దీంతో ఆ సినిమా వేసిన మచ్చను పరాశక్తి(Parasakthi)తో తుడిచి వేద్దామని ప్లాన్ చేశాడు టాలెంటెడ్ హీరో.
అయితే ఆ ప్లాన్ కూడా వర్కవుట్ అవలేదు. సుధా కొంగర(Sudha kongara) దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా, శ్రీలీల(Sree Leela) కోలీవుడ్ డెబ్యూ చేస్తూ చేసిన సినిమా పరాశక్తి. రిలీజ్ కు ముందు ఈ మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో పరాశక్తి విఫలమైంది. మిక్డ్స్ టాక్ తో మొదలైన ఈ సినిమా నెమ్మదిగా నెగిటివ్ టాక్ తో ఫ్లాపుగా మారింది. దీంతో శివ కార్తికేయన్ ఖాతాలో మరో ఫ్లాపు పడినట్టైంది. మరి శివ కార్తికేయన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎప్పుడెక్కుతాడో చూడాలి.






