GCIC: నాపెర్‌విల్లేలో ‘GCIC పొంగల్ సంబరాలు’.. సందడి చేయనున్న షణ్ముఖ ప్రియ
నాపెర్విల్లే: గ్రేటర్ చికాగో ఇండియన్ కమ్యూనిటీ (GCIC), AR ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నాపెర్విల్లే నగరంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారీ ఎత్తున ‘పొంగల్ కల్చరల్ సెలబ్రేషన్స్’ (Pongal Cultural Celebrations) నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ గాయనీ గాయకులతో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
కార్యక్రమ వివరాలు:
తేదీ, సమయం: జనవరి 17, శనివారం, సాయంత్రం 6 గంటల నుండి.
వేదిక: ఎల్లో బాక్స్ (Yellow Box), నాపెర్విల్లే.
ప్రధాన ఆకర్షణ: ప్రముఖ గాయని షణ్ముఖ ప్రియ తన పాటలతో అలరించనున్నారు. వీరితో పాటు ప్లేబ్యాక్ సింగర్ గోవింద్, ఇండియన్ ఐడల్ ఫేమ్ మనోజ్ఞ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. కార్యక్రమానికి సాహిత్య వింజమూరి యాంకర్‌గా వ్యవహరిస్తారు. సంక్రాంతి పండుగను విదేశాల్లో ఉన్న తెలుగువారంతా కలిసి జరుపుకోవడానికి, సాంస్కృతిక ప్రదర్శనలను ఆస్వాదించడానికి ఇదొక చక్కని వేదికని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం మరియు బుకింగ్స్ కోసం పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయవచ్చు లేదా నిర్వాహకులను సంప్రదించవచ్చు.






