TAGC: ఘనంగా TAGC 55వ వసంతోత్సవ వేడుకలు.. 2026 సభ్యత్వ నమోదు ప్రారంభం
చికాగో: అమెరికాలోని ప్రతిష్టాత్మక తెలుగు సంస్థలలో ఒకటైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (TAGC) 55వ వార్షికోత్సవ మైలురాయిని పురస్కరించుకుని 2026 సంవత్సరానికి గాను సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ దశాబ్దాలుగా కృషి చేస్తోంది.
సభ్యత్వ వివరాలు: సంస్థలో చేరాలనుకునే వారు లైఫ్ టైమ్ మెంబర్షిప్ (1250 డాలర్లు), ఫ్యామిలీ మెంబర్షిప్ (125 డాలర్లు), లేదా సింగిల్ మెంబర్షిప్ (60 డాలర్లు) ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. సభ్యత్వం పొందిన వారికి స్థానిక వ్యాపార సంస్థల్లో రాయితీలు, యువతకు మెంటార్షిప్ ప్రోగ్రామ్లు, వివిధ క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
2026 ఈవెంట్ క్యాలెండర్: ఈ ఏడాది నిర్వహించబోయే కార్యక్రమాల వివరాలను కూడా TAGC ప్రకటించింది.
జనవరి 24న మకర సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలు.
ఫిబ్రవరిలో బౌలింగ్ టోర్నమెంట్.
మార్చి 7న మహిళా దినోత్సవం.
ఏప్రిల్ 4న ఉగాది, శ్రీరామనవమి సంబరాలు.
జూన్ 21న సమ్మర్ పిక్నిక్.
అక్టోబర్ 18న బతుకమ్మ, నవంబర్ 14న దసరా, దీపావళి వేడుకలు నిర్వహించనున్నారు.
వీటితో పాటు బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్ టోర్నమెంట్లు, సామాజిక సేవా కార్యక్రమాలు ఏడాది పొడవునా కొనసాగుతాయని అధ్యక్షురాలు అర్చన పొద్దుటూరి, సభ్యత్వ కమిటీ చైర్మన్ సృజన్ నైనప్పగారి తెలిపారు. ఆసక్తి గల వారు www.tagc.org వెబ్సైట్ ద్వారా తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలని వారు కోరారు.






