Naravaripalle: నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్వగ్రామం నారావారిపల్లె (Naravaripalle)లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari), మంత్రి లోకేశ్ (Minister Lokesh), నారా బ్రాహ్మణి, దేవాంశ్, బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడా పోటీల్లో దేవాంశ్ పాల్గొన్నాడు. ఆయా పోటీలను సీఎం, కుటుంబసభ్యులు తిలకించారు. అంతకుముందు ప్రజల నుంచి వినతిపత్రాలను చంద్రబాబు స్వీకరించారు.






