Sunita: సుప్రీంకోర్టులో సునీత మరో అప్లికేషన్
మాజీ మంత్రి వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్య కేసు లో ఆయన కుమార్తె సునీత (Sunita) సుప్రీంకోర్టు (Supreme Court)లో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ కొనసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court)ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని పాక్షికంగా ఆదేశాలు ఇచ్చింది. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందని, ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను పట్టించుకోలేదని సుప్రీంకోర్టు దృష్టికి సునీత తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుత అప్లికేషన్‌తో పాటు పెండిరగ్లో ఉన్న అన్ని పిటిషన్లపై విచారణను అత్యున్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.






