Ramprasad Reddy: అక్రమంగా వసూలు చేస్తే .. కఠిన చర్యలు : మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఈ ఏడాది ఆర్టీసీ (RTC) ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండగ (Sankranti festival) సందర్భంగా అదనపు ఛార్జీలు పెంచబోమని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతోందన్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు క్షేమంగా సొంతూళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సులు (Private buses) అక్రమంగా ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






