Chandrababu: వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలి : చంద్రబాబు ఆదేశం
కాకినాడ జిల్లా సార్లంకపల్లె (Sarlankapalle)లో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ (Sankranti festival) సమయంలో ఈ అగ్నిప్రమాదం విషాదాన్ని తెచ్చిందన్నారు. గ్రామంలో ఉన్న 38 తాటాకు ఇళ్లు కాలిపోయాయని, బాధితులకు అన్ని విదిధాలుగా అండగా ఉండాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోంమంత్రి అనిత (Home Minister Anita), ఇతర అధికారులు ఆయనకు వివరించారు. తక్షణసాయంగా ఒక్కో కుటుంబానికి రూ.25 వేల నగదు అందజేస్తున్నామని తెలిపారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అప్పటివరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలన్నారు. ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అందే సాయంపై మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని సూచించారు.






