MSG: పాత పాటలకు భారీగా ఖర్చు పెట్టిన నిర్మాతలు
ఎప్పుడైనా పాత వాటికి ఉండే క్రేజ్ కొత్త వాటికి ఉండవని పెద్దలు నమ్ముతూ ఉంటారు. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే. పాత సాంగ్స్ కు ఉండే డిమాండ్, క్రేజ్ ఇప్పటి పాటలకు కొన్నేళ్ల తర్వాత ఉండవు. ఇప్పటి సాంగ్స్ ఎంత పెద్ద హిట్టైనా కొన్నేళ్లకు అవి ఎవరికీ గుర్తుండవు. కానీ అప్పటి పాటలు అలా కావు. ఇప్పటికీ అలనాటి సాంగ్స్ కు బాగా డిమాండ్ ఉంది.
ఇప్పటికే ఈ విషయం పలుమార్లు ప్రూవ్ అయింది. మొన్నా మధ్య కె ర్యాంప్(K Ramp) సినిమాలో ఒక పాత సాంగ్ ను వాడగా, అది సినిమాకు ఎంత పెద్ద ప్లస్ అయిందో తెలిసిందే. తాజాగా మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu) సినిమాలో పలు పాత సినిమాల్లోని పాటలను వాడగా, థియేటర్లలో ఆ పాటలు వచ్చనప్పుడు ఆడియన్స్ చేస్తున్న గోల అంతా ఇంతా కాదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే చిరంజీవి(Chiranjeevi) సినిమాలో పలు పాత సాంగ్స్ ను వాడగా, ఆ సాంగ్స్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేశాయి. కాగా ఆ పాత పాటలను సినిమాలో బిట్ లుగా వాడుకోవడానికి నిర్మాతలు రూ. కోటి ఖర్చు చేశారట. ఈ సినిమలో నవ్వింది మల్లె చెండు, రామ్మా చిలకమ్మా, సుందరీ నీవే నేనంట తో పాటూ గతేడాది రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం లోని సాంగ్ ను కూడా వాడుకోగా ఆ సాంగ్ రైట్స్ కోం నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారు. రిలీజ్ తర్వాత ఆ సాంగ్స్ కు థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆ కోటి రూపాయలు ఖర్చుని కూడా నిర్మాతలు మర్చిపోయారని సమాచారం.






