KTR: అలాచేస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం : కేటీఆర్
ప్రజలకు సౌకర్వంతంగా ఉండాలని జిల్లాలు ఏర్పాటు చేసి కలెక్టర్లను గడప దగ్గరకు తీసుకొస్తే, జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదనే సాకుతో ఎత్తేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లోని ఎంబీసీ (MBC) మైదానంలో మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు (Sarpanches), ఉపసర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ అభినందన సభ నిర్వహించి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒక్క జిల్లాను ముట్టుకున్నా అక్కడ ఉద్యమం చేస్తాం అని హెచ్చరించారు. ప్రజల వద్దకు అధికారుల్ని తీసుకురావాలని కేసీఆర్ (KCR) హయాంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేశాం. తండాలను పంచాయతీలుగా మార్చాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలను తొలగించాలని చూస్తోంది. అలాచేస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం అని అన్నారు.






